![]() |
![]() |

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు అక్కడే ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మ మృతి చెందారనే విషయం తెలియగానే చిరంజీవి, ప్రకాశ్‌రాజ్, జీవిత రాజశేఖర్ సహా పలువురు సినీ ప్రముఖులు బసవతారకం హాస్పిటల్‌కు వెళ్లి పద్మకు నివాళులు అర్పించారు. ఉత్తేజ్‌ను పరామర్శించారు.
ఉత్తేజ, పద్మ దంపతులకు చేతన అనే కుమార్తె ఉన్నారు. చేతన కూడా నటే. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన చేతన, 2017లో 'పిచ్చిగా నచ్చావ్' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. కాగా పద్మ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
![]() |
![]() |