![]() |
![]() |
.jpg)
రీసెంట్ గా రిలీజైన `సీటీమార్`లో జోడీగా అలరించారు మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా. కట్ చేస్తే.. ఈ ఇద్దరు మరోమారు జతకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `లక్ష్యం` (2007), `లౌక్యం` (2014) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత గోపీచంద్ - దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. కాగా, ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నాని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే గోపీచంద్ - శ్రీవాస్ థర్డ్ జాయింట్ వెంచర్ లో తమన్నా ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. `సీటీమార్`తో ఇంప్రెస్ చేసిన గోపీచంద్ - తమన్నా వన్స్ మోర్ పెయిర్ గా ఆకట్టుకుంటారేమో చూడాలి.
కాగా, గోపీచంద్ ప్రస్తుతం `పక్కా కమర్షియల్`తో బిజీగా ఉండగా.. తమన్నా చేతిలో `ఎఫ్ 2`, `గుర్తుందా శీతాకాలం` వంటి తెలుగు చిత్రాలున్నాయి. అలాగే తమన్నా నెగటివ్ రోల్ లో నటించిన `మాస్ట్రో`.. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
![]() |
![]() |