![]() |
![]() |

ఇటీవల 'సలార్'(Salaar)తో ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. త్వరలో 'కల్కి 2898 AD'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కల్కి 2898 AD'(Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ప్రభాస్ కెరీర్ లో 'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్న సినిమా 'కల్కి' అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
.webp)
'కల్కి 2898 AD' సినిమాను 2024, మే 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 9న సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అనౌన్స్ మెంట్ రొటీన్ కి భిన్నంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో విభిన్న తరహాలో రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు.
కాగా మే 9వ తేదీ అనేది వైజయంతీ సంస్థకి సెంటిమెంట్ డేట్. ఆ సంస్థ నుంచి వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' 1990 మే 9న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, 2018 మే 9న విడుదలైన 'మహానటి' కూడా సంచలన విజయం సాధించింది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ డేట్ కి వస్తున్న 'కల్కి' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

![]() |
![]() |