![]() |
![]() |
.webp)
సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ (hanuman ) నిజంగా ఆడియన్స్ కి వెయ్యేనుగులా ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ కూడా గూస్ బంప్స్ అని చెప్తుంటే పండగ చేసుకుంటున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ , ఈ మూవీ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మూవీ రివ్యూస్ అన్నీ పీక్స్ లో ఉన్నాయి. సంక్రాంతి హిట్ అంటూ చిన్న పెద్దా స్టార్స్ చెప్తున్న మాట..ఇక పొలిమేర హీరో మరో చైల్డ్ ఆర్టిస్ట్ బాలాదిత్య కూడా తనకు సినిమా ఎందుకు నచ్చిందో, అసలు ఎవరెవరు ఎలా చేశారో కూడా చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "నాకు అత్యంత ఇష్టమైన నటుల్లో గెటప్ శీను ఒకడు.
ఇతనొక సూపర్ టాలెంటెడ్ పెర్ఫార్మర్ ..ఈ మూవీ ద్వారా తనను తాను ఇంకా నిరూపించుకున్నాడు...ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీ "ఆ" మూవీ నుంచే నేను అతని ఫ్యాన్ గా మారిపోయాను..ఇప్పుడు హనుమాన్ మూవీతో ఆ అభిమానం ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు భారతీయులందరినీ గర్వపడేలా చేసారు. ఇక ది మ్యాన్ ఆఫ్ ది షో ఎవరు అంటే తేజ సజ్జ. మేమంతా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులమే. తేజ చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. బాలనటులు ఎలాంటి వింతలు చేస్తారో ప్రపంచానికి మళ్ళీ చేసి చూపించాడు..
ఇక ఫైనల్ గా అసలైన సినిమా హీరో.. నేను చాలా ఇష్టపడే హనుమంతుడే.. ఆయన్ని భగవంతుని స్వరూపంగా భావించడం వల్ల కాదు.. అతని అంతర్బలం, జ్ఞానం, తెలివి, నైపుణ్యం, శక్తి, నిస్వార్థత, వినయం, ముఖ్యంగా ధర్మమార్గాన్ని అనుసరించాలనే అతని సంకల్పం.. సినిమాలో నా హీరోని చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది ..మూవీ ఎండింగ్ మాత్రం నిజంగా గూస్ బంప్స్...బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ , స్టంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి" అని చెప్పొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు బాలాదిత్య. ఇక అయోధ్య (ayodya ) లో త్వరలో రామ మందిర నిర్మాణం జరగబోతున్న విషయం తెలిసిందే..ఆ రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు రాముడి దాసుడు హనుమాన్ (hanuman ) మూవీ కలెక్షన్స్ నుంచి కొంత పంపిస్తాం అంటూ ప్రకటించారు ఈ మూవీ టీమ్...ఇక ఆదిరెడ్డి కూడా ఫుల్ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఇక నుంచి తేజాని ఎవరూ చైల్డ్ ఆర్టిస్ట్ అనరు. హీరో అయ్యాడు..ఇంకా పెద్ద హీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాడు. ప్రతీ సంక్రాంతికి ఏ మూవీ విన్నర్ అవుతుందా అని ఎదురు చూస్తారు..ఈ సంక్రాంతి విన్నర్ హనుమాన్ మాత్రమే.
![]() |
![]() |