![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన 'గుంటూరు కారం' సినిమా, భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలయ్యాయి. అయితే ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ తెచ్చుకుంటోంది.
'గుంటూరు కారం' మహేష్ క్యారెక్టరైజేషన్ ని, ఆయన ఎనర్జీని నమ్ముకొని తీసిన సినిమా అని అంటున్నారు. చిన్న కథను తీసుకొని.. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో బోర్ కొట్టకుండా నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడం త్రివిక్రమ్ శైలి. 'గుంటూరు కారం' కోసం కూడా త్రివిక్రమ్ చిన్న కథనే ఎంచుకున్నాడని, కానీ తనదైన శైలిలో పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. మహేష్ కామెడీ టైమింగ్, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫస్టాఫ్ బాగానే ఉందని.. అయితే సెకండాఫ్ లో మాత్రం త్రివిక్రమ్ చేతులెత్తేశాడని చెబుతున్నారు. త్రివిక్రమ్ మార్క్ మిస్ అయిందని, ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్, డ్యాన్స్ లే ఈ సినిమాకి ప్లస్ అని అంటున్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ సహా మాస్ ని మెప్పించే అంశాలు కొన్ని ఉన్నాయని, అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా కొంత నచ్చే అవకాశముందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ వన్ మ్యాన్ షో, సంక్రాంతి సీజనే ఈ సినిమాని కాపాడాలి అనేది ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నమాట.
![]() |
![]() |