![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ఫ్యాన్స్ ఎంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారో చెప్పలేం. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ అదిరిపోయిందనే పేరొచ్చింది. 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో రిలీజ్ చేసిన ఆ టీజర్‌కు తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ హైలైట్. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ టీజర్‌కు ఆయనే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తారక్ వాయిస్‌కు ఆయా భాషల ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కాగా తారక్ బర్త్‌డేకి 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్.. అది రాకపోయేసరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన ఆంక్షల కారణంగా సాంకేతిక పనులు జరగకపోవడంతో ఆ టీజర్ తీసుకు రాలేకపోతున్నామని ముందుగానే రాజమౌళి ప్రకటించినా అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు.
ఆ విషయం అలా ఉంచితే 'ఆర్ఆర్ఆర్'లో కొమరం భీమ్‌గా తారక్ నటిస్తున్నాడు. ఇందులో ఆయన 6 గెటప్స్‌లో కనిపిస్తాడనేది ప్రచారంలోకి వచ్చింది. విలన్లపై పోరాడే క్రమంలో రకరకాల వేషాలను ఆయన వేస్తాడనీ, అలా మొత్తం 6 రకాల వేషాల్లో దర్శనమిస్తాడనీ ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై యూనిట్ మెంబర్స్ ఎవరూ నోరు మెదపడం లేదు. ఒకవేళ అదే నిజమైతే ఫ్యాన్స్‌కు ఇది సంబరాన్ని కలిగించే విషయమే. 2020 వేసవిలో ఈ మూవీని విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |