![]() |
![]() |

భగవంత్ కేసరి సినిమాతో 108 చిత్రాలని పూర్తిచేసుకున్న బాలకృష్ణ తన 109 వ చిత్రాన్ని హిట్ చిత్రాల దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది.
ఈ మూవీ కొత్త షెడ్యూల్ రాజస్థాన్ లో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ మరియు ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ చిత్ర యూనిట్ తో పాటు కొంత మంది ఆర్టిస్టులు ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నారు. బాలకృష్ణ కూడా మరి కొన్ని రోజులో అక్కడికి వెళ్తాడు.ఇప్పుడు ఈ వార్తలతో రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్న మా కోసం బాలయ్య సినిమాని త్వరగా పూర్తి చేస్తున్నాడని అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సితార ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ సినిమా మీద బాలకృష అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |