![]() |
![]() |

వైవిధ్యానికి పెద్దపీట వేసే అగ్ర కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. రోడ్ డ్రామా నేపథ్యంలో 30 ఏళ్ళ క్రితం నాగ్ చేసిన ఓ విభిన్న ప్రయత్నంగా 'చైతన్య'ని చెప్పుకోవచ్చు. నటుడు ప్రతాప్ పోతన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాగార్జునకి జంటగా గౌతమి నటించగా.. గిరీశ్ కర్నాడ్, కోట శ్రీనివాసరావు, రఘువరన్, బాబు ఆంటోని, చిన్నా, నిళల్‌గళ్ రవి, రావి కొండలరావు, సుత్తి వేలు, విజయ్ చందర్, పీజే శర్మ, సిల్క్ స్మిత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించగా.. దిగ్గజ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో "ఓహో లైలా" చార్ట్‌బస్టర్ గా నిలిచింది. శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యం బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1991 జూన్ 7న విడుదలైన 'చైతన్య'.. నేటితో 30 వసంతాలను పూర్తిచేసుకుంది.
'చైతన్య' - కొన్ని విశేషాలు:
* ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారు.
* ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు రాజీవ్ మీనన్.. ఈ చిత్రంతోనే సినిమాటోగ్రాఫర్‌గా తొలి అడుగేశారు. తెలుగులో ఆయన డీఓపీగా వ్యవహరించిన ఏకైక సినిమా 'చైతన్య' కావడం విశేషం.
* ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు చిత్రం 'చైతన్య'.
* మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో రేసర్‌గా చిన్న వేషంలో కనిపిస్తారు.
![]() |
![]() |