![]() |
![]() |

మనుషుల్లో వర్మ వేరయా... అంటుంటారు వర్మ భక్తులు అనబడే అభిమానులు. వర్మకు సెంటిమెంట్లు ఉండవని, రిలేషన్లు పట్టించుకోడని... పొగడ్తలు అస్సలు పడవని అంటుంటారు. మనమూ చాలా ఏళ్లుగా వర్మని అలానేచూస్తున్నాం. అయితే... శివ టూ వంగవీటి ఫంక్షన్లో చూసిన వర్మ మాత్రం టోటల్‌గా వేరు. అసలు ఈ పోగ్రాం వర్మ తనని పొగిడించుకోవడానికే పెట్టాడా అనిపిస్తుంది. దానికి తగ్గట్టు అతిథులంతా ఆహా వర్మ... ఓహో వర్మ అంటుంటే.. వర్మ తెగ సంబరపడిపోయాడు. దాంతో వర్మ కూడా ఇంత భజన ప్రియుడైపోయాడేంటబ్బా అనిపిస్తుంటుంది. సాధారణంగా వర్మ ఇంకొకరిని పొగడడానికి ఇష్టపడడు. కానీ ఆ విషయంలోనూ వర్మ మారాడు. అటు రాజమౌళినీ, ఇటు నాగార్జుననీ పొగిడిపాడేశాడు.
ఒట్లు వేసి.. వాళ్లిద్దరూ అంటే తనకెంత ఇష్టమో నిరూపించుకొన్నాడు. వెంకటేష్‌నీ వదల్లేదు వర్మ. క్షణ క్షణంలో మీకు అన్యాయం చేశా.. ఈసారి హీరోయిజం ఉన్న సినిమా తీద్దాం అంటూ మాటిచ్చేశాడు. మొత్తానికి ఈ ఫంక్షన్‌లో ఓ డిఫరెంట్ వర్మ కనిపించాడు జనాలకు. ఎప్పుడూ పబ్లిసిటీ కోసం డబ్బులు ఖర్చుపెట్టని వర్మ వంగవీటి కోసం ఈ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్‌ని నిర్వహించడమే ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనూ ఈ పోగ్రాం అంతా డప్పుల మోతే. వర్మ మారుతున్నాడండోయ్. మరి ఈ మార్పు ఎందుకోసమో తెలియాలంటే కనీసం కొంత కాలం ఆగాల్సిందే.
![]() |
![]() |