![]() |
![]() |

ఎవరిని ఎలా ఎప్పుడు బుట్టలో పడేయాలో రాంగోపాల్ వర్మకి బాగా తెలుసు. అటు వంగ వీటి ప్రమోషన్ల కోసం ఇటు.. టాలీవుడ్‌ని మరోసారి ప్రసన్నం చేసుకోవడానికి `శివ టూ వంగవీటి` అనే ఓ కార్యక్రమం తలపెట్టాడు రాంగోపాల్ వర్మ. ఈ షోకి అమితాబ్‌బచ్చన్ వస్తాడని ప్రచారం సాగినా, చివరి నిమిషాల్లో అమితాబ్ హ్యాండిచ్చాడు. అయితే వేడుక ఎక్కడా కళ తప్పలేదు. వర్మ తనదైన స్పీచ్‌తో షోని రక్తి కట్టించాడు. అంతేనా.. నాగార్జునతో 'శివ 2' చేయాలని ఉంది అని చెప్పించాడు. అక్కడే వర్మ చాతుర్యం బయటపడిపోయింది.
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అటు వర్మనీ ఇటు శివనీ పొగడడమే పనిగా పెట్టుకొన్నారు. దాంతో పాటు నాగార్జునకు శివ నాటి రోజులు గుర్తొచ్చి ఉంటాయి. అందుకే వర్మకి మరో అవకాశంఇవ్వాలనుకొన్నాడో ఏమో.. ``శివ కి సీక్వెల్ చేయాలని చాలామంది నన్ను అడిగారు. ఆ సినిమా చేస్తే వర్మతోనే చేస్తా. లేదంటే అసలు ముట్టుకోనే ముట్టుకోను`` అన్నాడు. వర్మ కూడా నాగార్జున నుంచి ఇలాంటి ప్రామిస్ కోసమే ఎదురుచూసుంటాడు. నాగార్జునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఇక వర్మని ఆపతరమా? నేడో రేపో శివ 2కి సంబంధించిన ఓ ఎనౌన్స్ మెంట్ చేసినా చేసేయొచ్చు.
![]() |
![]() |