Home  »  News  »  jana nayagan Movie Review In Telugu: జననాయకుడు మూవీ రివ్యూ

Updated : Jul 23, 2026

 

-సినిమా పేరు: జన నాయగన్
-న‌టీన‌టులు: జోసఫ్ విజయ్, పూజా హెగ్డే, మమితా భైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నాజర్, సునీల్  తదితరులు
-సినిమాటోగ్ర‌ఫీ:సత్యన్ సూర్యన్
-ఎడిటింగ్: ప్రదీప్ ఈ  రాఘవ్ 
-మ్యూజిక్: అనిరుద్ 
-నిర్మాత‌:  వెంకట్ కె నారాయణ
-బ్యానర్:  కేవిఎన్ ప్రొడక్షన్స్ 
-రచన,దర్శకత్వం: హెచ్ వినోత్.
-రిలీజ్ డేట్ : జులై 23 ,2026 


ఎట్టకేలకు ఈ రోజు దళపతి జోసఫ్ విజయ్(Vijay)'జననాయకుడు'(Jana Nayakudu)గా  థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. దీంతో అభిమానులు, మూవీ లవర్స్ థియేటర్స్ కి పోటెత్తారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
ఒక ఊరి గ్రామప్రజలు గత ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి   భయపడుతూ ఉంటారు. దళపతి వెట్రి కొండన్( విజయ్) నాలుగు పదుల వయసు దాటిన సగటు వ్యక్తి. ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కూతురు విజ్జి(మమితా బైజు)ని సొంత కూతురులా పెంచుతుంటాడు. విజ్జికి భయంతో పాటు ఆయాసం లాంటి హెల్త్ ప్రాబ్లెమ్ ఉంటాయి. కానీ విజ్జిని ఆర్మీ ఆఫీసర్ ని చెయ్యాలని వెట్రి ప్రయత్నిస్తుంటాడు. కానీ విజ్జికి మాత్రం ఆర్మీ ఆఫీసర్ అవ్వడం ఇష్టం ఉండదు. జాన్ హిమ్లర్(బాబీ డియోల్). అత్యంత క్రూరుడుతో పాటు అసాంఘిక శక్తి. శ్వాసినియా దేశంలోని ప్రజలు ఒకరికొకరు చంపుకునేలా చేసి ఆ దేశం నాశనమయ్యేలా చేస్తాడు. రోజా రంగ స్వామి  ( ప్రకాష్ రాజ్) సీనియర్ పొలిటికల్ లీడర్. ప్రతి పక్షంలో ఉన్నా సరే తమిళనాడు రాష్ట్రాన్ని శాసించే నియంత. తన తాత, తండ్రి, తనతో పాటు తన బిడ్డలు, మనవళ్ళు మాత్రమే తమిళనాడుని పరిపాలించాలనుకుంటాడు.  రోజాపై ఈగ వాలినా కొన్ని లక్షల  ప్రజలు ఊరుకోరు. వెట్రి కొండన్, జాన్ హిమ్లర్, రోజా రంగ స్వామి మధ్య నడిచే సంఘర్షణ, గతం తాలూకు ఘర్షణ ఏంటి అనేదే జన నాయకుడు కథ.

ఎనాలసిస్ 
 మూవీ చూస్తున్నంత సేపు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ భగవంత్ కేసరి గుర్తుకొస్తూనే ఉంటుంది. పొలిటికల్ టచ్ తప్ప  మిగిలిన కథ మొత్తం ఇంచు మించు సేమ్.  ఆడవాళ్ళకి ఇన్ స్ప్రెషన్ గా నిలిచే డైలాగ్స్, ప్రజల వలన చెడ్డ రాజకీయనాయకుడు ఎలా పుట్టుకొస్తున్నారనే డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వెట్రి  ఇంట్రడక్షన్, విజ్జి, వెట్రి మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. ఆ తర్వాత కథ కొంచం స్లోగా నడవడంతో పాటు సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.  కయల్ గా చేసిన పూజా హెగ్డే,  వెట్రి మధ్య పెద్దగా సీన్స్ నడవలేదు. శ్వాసినియా దేశానికీ సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ గా ఉంది. సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.సెకండ్ హాఫ్ లో వెట్రి,  జాన్ హిమ్లర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్లేదు . ముఖ్యంగా హిమ్లర్ చెడ్డవాడిగా మారడానికి చూపించిన రీజన్ వెరైటీగా కొత్తగా ఉంది. మతాల మధ్య చిచ్చు అనేది రొటీన్ పాయింట్. కాకపోతే దర్శకుడు, ప్రొడక్షన్ వాల్యూస్, విజయ్ వల్ల సీన్స్ బోరు కొట్టకుండా సాగాయి. 

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు

వెట్రిగా విజయ్ పెర్ఫార్మ్ పతాక స్థాయిలో ఉంది. తన కూతురు కాకపోయినా విజ్జిని సొంత తండ్రిగా, ప్రాణానికి ప్రాణంగా పెంచే తండ్రిగా, మరో వెర్షన్ లో రాజకీయ నాయకుల అంతు చూసే పోలీస్ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ చేసాడు. ముఖ్యంగా  స్కూల్ వయస్సు ఉన్న  పాపతో పెదనాన్న అయినా బాబాయ్ అయినా, ఎవరైనా సరే నిన్ను మూడు చోట్ల  టచ్ చేస్తే అమ్మకి చెప్పాలి అనే సీన్ లో విజయ్ నటన నభూతో న భవిష్యత్. విజ్జి గా  మమితా భైజు  మెప్పించే నటనే ప్రదర్శించింది. బాబీడియోల్, ప్రకాష్ రాజ్ తో మిగతా నటీనటులు కూడా తమ కెరీర్ లో గుర్తుండిపోయే పెర్ఫార్మ్ చేశారు.  ముఖ్యంగా బాబీ డియోల్ హైలెట్ అని చెప్పవచ్చు. పూజా హెగ్డే తో తో పాటు మిగతా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అనిరుద్ నుంచి వచ్చిన సాంగ్స్ లో మెరుపులు లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వినోత్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. రచయితగా రొటీన్ సీన్స్ కావడం కొంచం మైనస్.  నిర్మాణ విలువలు. ఫొటోగ్రఫీ ప్లస్ 

బలాలు
1 . విజయ్ పెర్ ఫార్మెన్స్ 
2 .  శ్వాసినియా దేశం ఎపిసోడ్ 
3 . సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ 
4 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
5 . ఫొటోగ్రఫీ 
6 . డైరెక్షన్ 

బలహీనతలు 
1 . అందరూ చూసేసిన భగవంత్ కేసరి కథ కావడం 
2 . ఫస్ట్ హాఫ్ 
3 . రొటీన్ సీన్స్ 

చివరిగా చెప్పాలంటే విజయ్ యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్. వినోత్ దర్శకత్వ ప్రతిభ జననాయగన్ కి బలం. కానీ రొటీన్ సీన్స్ ,భగవంత్ కేసరి గా బాలయ్య ఇప్పటికే తెలుగు వారి ఇంట్లో తిష్ట వేయడం జననాయగన్ కి మైనస్.

రేటింగ్ 2 .5 /5                                                                                అరుణాచలం 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.