Home  »  News  »  బిగ్ డీల్.. షాకిస్తున్న 'కొరియన్ కనకరాజు' బిజినెస్ లెక్కలు.!

Updated : Jul 23, 2026

వినూత్న కథాంశాలతో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదే వరుసలో విభిన్నమైన టైటిల్, ఆసక్తికరమైన కంటెంట్‌తో విడుదల ముందే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. 

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ బిజినెస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు (ఓటీటీ రైట్స్) ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడుపోవడం ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. అటువంటిది 'కొరియన్ కనకరాజు' చిత్రానికి ఏకంగా 15 కోట్ల రూపాయల డిజిటల్ డీల్ కుదరడం అంటే ఈ సినిమా కంటెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారీ ఓటీటీ డీల్ తో ఉత్సాహంలో ఉన్న నిర్మాతలు, ఇప్పుడు థియేట్రికల్ హక్కుల రూపంలో కూడా భారీ స్థాయిలోనే రాబట్టేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీగా రాబట్టాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆంధ్ర ప్రాంత థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు రూ.5 నుంచి 6 కోట్లు, సీడెడ్ ఏరియా నుంచి రూ.1.5 కోట్లు, నైజాం (తెలంగాణ) ప్రాంతం నుంచి రూ.4 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ ద్వారా సాధించాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు.

మొత్తానికి ఆంధ్ర నుంచి 5-6 కోట్లు, సీడెడ్ నుంచి 1.5 కోట్లు, నైజాం నుంచి 4 కోట్లు, ఓటీటీ నుంచి 15 కోట్లు పొందుతూ 'కొరియన్ కనకరాజు' ప్రీ-రిలీజ్ బిజినెస్ 25 కోట్ల మార్కుని క్రాస్ చేయడం విశేషం. ఆగస్టు 7న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'కొరియన్ కనకరాజు' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

 

Korean Kanakaraju, Business, OTT Rights, Varun Tej

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.