![]() |
![]() |

పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంభందించి హీరో పవన్ కళ్యాణ్ తో చిత్ర సమర్పకులు ఎ.ఎం.రత్నం, డైరెక్టర్ క్రిష్ మంగళవారం చర్చలు జరిపారు.
పవన్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భీమ్లా నాయక్'తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే 'హరిహర వీరమల్లు' షూటింగ్ పునప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, పాటలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి.
ఇప్పటివరకు 'హరిహర వీరమల్లు' షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు. 'హరిహర వీరమల్లు' 2022 ఏప్రిల్ 29 న విడుదల చేయనున్నట్లు పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని చిత్ర నిర్మాణ కార్యక్రమాలు త్వరితగతిన జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
![]() |
![]() |