![]() |
![]() |

సినిమా టికెట్ ధరల విషయమై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డితో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరి 10న సమావేశమయ్యారు. ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే శ్యామ్' ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ఉన్న ప్రభాస్ అతి తక్కువ ధరకు టికెట్ల అమ్మకం వల్ల బిగ్ ఫిలిమ్స్‌కు కచ్చితంగా బిగ్ లాస్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. "ఆంధ్ర, తెలంగాణ అనేవి పెద్ద మార్కెట్లు. కమర్షియల్‌గా ఆంధ్ర చాలా పెద్దది. 'రాధే శ్యామ్' లాంటి సినిమాలు తీసినప్పుడు, టికెట్ ధరలు తక్కువగా ఉంటే ప్రొడ్యూసర్లకు షాకే. బిజినెస్‌లో 40 నుంచి 50 శాతం తక్కువ వస్తుంది. కాబట్టి ఇది భారీ నష్టం కిందే లెక్క. సినిమాలకు సపోర్ట్ అవసరం." అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.
మునుపు ఏడేళ్ల కాలంలో మూడంటే మూడు సినిమాలు మాత్రమే ఆయనవి రిలీజయ్యాయి. ఆ లోటును పూడ్చుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు ఒప్పుకుంటూ వస్తున్నాడాయన. అవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. "సంవత్సరానికి రెండు సినిమాలు మాత్రమే చేయగలనని అనుకుంటున్నా. ఇప్పుడు చాలా ముఖ్యమైన సినిమాలు చేస్తున్నా. వచ్చే మూడేళ్లలో ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నా. ఎందుకంటే గత ఏడేళ్ల కాలంలో ఎక్కువ వర్క్ చేయలేదు." అని ఆయన చెప్పాడు.
'రాధే శ్యామ్' మార్చి 11న భారీ స్థాయిలో రిలీజవుతుండగా, 2024 వరకు ఊపిరి సలపనివ్వని పనితో బిజీ బిజీగా గడపనున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన దీపికా పడుకోనే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'ప్రాజెక్ట్ కె' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే 'ఓమ్ రౌత్' డైరెక్షన్‌లో 'ఆదిపురుష్'ను ఆయన కంప్లీట్ చేశాడు. ఆ సినిమా 2023 జనవరిలో రిలీజ్ కానున్నది. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్' మూవీ చేస్తున్న ఆయన సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్' మూవీని అంగీకరించాడు.
![]() |
![]() |