![]() |
![]() |

`గబ్బర్ సింగ్` (2012) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తాజాగా `భవదీయుడు..! భగత్ సింగ్` అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. `గబ్బర్ సింగ్`కి బాణీలందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా స్వరాలు సమకూర్చనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో పవన్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ-లుక్ లో గానీ, ఈ రోజు రివీల్ చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ లో గానీ పూజా హెగ్డే పేరు కనిపించలేదు. అలాగే ట్వీట్స్ లో ఆమె పేరుని ట్యాగ్ చేయలేదు. దీంతో.. పూజా హెగ్డే ఇందులో నటిస్తుందా? లేదా? అన్న విషయంపై సందిగ్దత నెలకొని ఉంది. కాకపోతే, పవన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పూజ ట్వీట్ చేసి ఉండడంతో ఆమె నటించబోతోందనే విషయం చెప్పకనే చెప్పిందనే ఊహాగానాలు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న `భవదీయుడు..! భగత్ సింగ్`లో ఆమె ఎంట్రీపై బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ అధికారిక ప్రకటన ప్లాన్ చేశారట హరీశ్ అండ్ టీమ్. మరి.. ఈ కథనంలో వాస్తవమెంతో తెలియాలంటే అక్టోబర్ 13 వరకు వేచిచూడాల్సిందే.

కాగా, ఇప్పటికే హరీశ్ దర్శకత్వంలో `డీజే`, `గద్దలకొండ గణేశ్` చేసిన పూజకి ఇది మూడో చిత్రం కానుండగా.. పవన్ తో మాత్రం తనకి తొలి సినిమా కానుంది.
![]() |
![]() |