![]() |
![]() |

లాక్‌డౌన్ పీరియడ్‌ను సీనియర్ హీరోయిన్ శ్రియ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ టైమ్‌లో తాను ఏమేం చేస్తున్నదో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తూ వాళ్లను ఆనందపరుస్తోంది. రష్యన్ అయిన ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్ సైతం శ్రియతో పాటు ఏదో ఒక పనిచేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. కొద్ది రోజుల క్రితం భర్తతో కలిసి వంటపాత్రలను శుభ్రంచేసే చాలెంజ్ విసిరిన శ్రియ తాజాగా భర్తతో కలిసి ఓ డిఫరెంట్ గేమ్ ఆడి, నవ్వించింది. ప్లకార్డుల తరహాలో పేపర్‌పై ఒకరికొకరు పూర్తి భిన్నమైన స్లోగన్స్ ప్రదర్శించి అల్లరి చేశారు.
ఫ్లోరింగ్‌పై కూర్చున్న శ్రియ మొదట 'సామాజిక దూరం పాటించండి' అనే స్లోగన్‌ను ప్రదర్శిస్తే, ఆమె వెనుక నిల్చొని 'ఆమె నాన్‌స్టాప్‌గా మాట్లాడుతోంది' అనే స్లోగన్ చూపించాడు ఆండ్రీ కొశ్చీవ్. 'నాన్‌స్టాప్‌గా పనిచేస్తున్న వాళ్లందరికీ థాంక్స్' అని శ్రియ చూపితే, 'నాకు రోజంతా పని చెబుతోంది' అని కొశ్చీవ్ చూపించాడు. 'ఇంట్లో ఉండండి' అని శ్రియ చెబితే, 'ఆమె నుంచి నన్ను కాపాడండి' అని వేడుకున్నాడు భర్త. ఒక్క మాటా మాట్లాడకుండా ఇలా స్లోగన్స్ చూపిస్తూ, వాటికి తగ్గ హావభావాలు ప్రదర్శిస్తూ మనకు ఆహ్లాదాన్ని పంచారిద్దరూ. ఈ వీడియోకు True love అనే క్యాప్షన్ జోడించింది శ్రియ. ఈ తరహా ఆటలు, పనులతో ప్రస్తుత సంక్షోభకాలాన్ని ఆనందమయం చేసుకుంటున్న తారల జాబితాలో శ్రియ ముందుంది.
![]() |
![]() |