![]() |
![]() |

దేన్నయినా కాంట్రవర్సీ చేసే అలవాటున్న రామ్‌గోపాల్ వర్మ తాజాగా 'పవర్ స్టార్' అనే సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన డైరెక్టుగా చెప్పకపోయినా అది పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించిన సినిమా అని అందరికీ తెలుసు. తెలుగునాట 'పవర్ స్టార్' అనే విశేషణాన్ని ఉపయోగించింది పవన్ కల్యాణ్‌కే. ఆ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్‌ను ఎవరు చేయబోతున్నారో కూడా ఓ వీడియో క్లిప్ ద్వారా వెల్లడించాడు వర్మ. తన ఆఫీస్‌కు వచ్చిన అతడిని వీడియో తీసి, దాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.
'అత్తారింటికి దారేది' మూవీలో పవన్ కల్యాణ్ వేసిన రెడ్ కలర్ టీ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్, మెడలో స్కార్ఫ్ డ్రస్‌ను పోలిన డ్రస్ వేసుకున్న ఆ యువకుడి పేరేమిటో ఆర్జీవీ వెల్లడించలేదు. ఎవరితోనైనా అతనికి పోలికలు ఉంటే, అది కేవలం incidentally coincidental and intentionally unintentional అంటూ తనదైన తెలివితో ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు వర్మ. ఆ యువకుడి హెయిర్ స్టైల్ సైతం పీకే హెయిర్ స్టైల్‌ను పోలి ఉండటం గమనార్హం.
ఎప్పుడు ఆ మూవీని స్టార్ట్ చేసేది ఆర్జీవీ వెల్లడించకపోయినా, త్వరలోనే దాని షూటింగ్ మొదలవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'పవర్ స్టార్' మూవీని అనౌన్స్ చేసిన ఆర్జీవీ ట్వీట్ ప్రకారం చూస్తే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకొని ఈ మూవీ తీయనున్నట్లు అర్థమవుతోంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తరహాలోనే ఈ సినిమా కూడా కాంట్రవర్షియల్ అంశాలతో ఉంటుందని విశ్లేషకులు ఊహిస్తున్నారు.
![]() |
![]() |