![]() |
![]() |

బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పనిచెయ్యడానికి బానిసల స్థానంలో 13 లక్షల మంది భారతీయులు తరలింపబడ్డారు. వారిలో ఒకరు గుబిలి వీరయ్య. చెరుకు ఫారాలలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు, పడిన కష్టాలు ఎలాంటివో ఆయన మునిమనవడు కృష్ణ గుబిలి పుస్తకం రూపంలో అక్షరబద్ధం చేశారు. ఆ పుస్తకం పేరు 'వీరయ్య'. అక్టోబర్ 3, శనివారం రాత్రి 7 గంటలకు సీసీవీఏ ఆధ్వర్యంలో ఈ పుస్తక పరిచయ సభ జరగనున్నది.
ఈ పరిచయ సభకు ముఖ్య అతిథులుగా పేరు పొందిన కవి, రచయిత, సాహితీ విమర్శకులు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, తెలుగు వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానళ్లలో అగ్రగామి సంస్థ అయిన తెలుగువన్ గ్రూప్ అధినేత రవిశంకర్ కంఠంనేని హాజరవుతున్నారు. సీసీవీఏ సీఈఓ, చరిత్ర పరిశోధకులు అయిన ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో రచయిత కృష్ణ గుబిలి, తెలుగు అనువాద రచయిత గురుమూర్తి గుబిలి పాల్గొంటున్నారు.
'వీరయ్య' పుస్తక పరిచయ సభ viriah.com/t వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నది.

![]() |
![]() |