![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఏ ఇండియన్ సినిమాకి రానంతగా హాలీవుడ్ ప్రముఖుల నుంచి 'ఆర్ఆర్ఆర్'కి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' పేరు, రాజమౌళి పేరు మారుమోగిపోతున్నాయి. అయితే గ్లోబల్ గా ఇంత గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ నామినేషన్స్ కి పంపకపోవడం సినీ ప్రియులను నిరాశపరిచింది. అయితే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆస్కార్ నామినేషన్స్ దిశగా ఆర్ఆర్ఆర్ అడుగులు పడుతున్నాయి.

ఫర్ యువర్ కన్సిడరేషన్(ఎఫ్.వై.సి) కింద 15 విభాగాలలో ఆస్కార్ నామినేషన్స్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. బెస్ట్ మోషన్ పిక్చర్, ఉత్తమ దర్శకుడు(రాజమౌళి), ఉత్తమ నటుడు(జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్), ఉత్తమ సహాయ నటుడు(అజయ్ దేవగన్), బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎం.ఎం. కీరవాణి), బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్(శ్రీకర్ ప్రసాద్), బెస్ట్ సౌండ్ (రఘునాధ్ కేమిశెట్టి, బోలోయ్ కుమార్ బోలోయ్, రాహుల్ కర్పే), బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లే (విజయేంద్రప్రసాద్, రాజమౌళి, సాయిమాధవ్ బుర్రా), ఉత్తమ సహాయ నటి(ఆలియా భట్), ఉత్తమ సినిమాటోగ్రఫీ (కె.కె. సెంథిల్ కుమార్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (రమా రాజమౌళి), బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ (నల్ల శ్రీను, సేనాపతి నాయుడు), బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్-విఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్) ఇలా మొత్తం 15 విభాగాల్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్. మరి టీమ్ ఆశలు ఫలించి కొన్ని విభాగాల్లోనైనా ఆస్కార్ నామినేషన్స్ సాధిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |