![]() |
![]() |

చందూ మొండేటి అనగానే 'కార్తికేయ' సినిమా గుర్తొస్తుంది. ఈ మూవీ మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'కార్తికేయ 2' సినిమాను రూపొందించాడు. తర్వాత సవ్యసాచి మూవీ తీసాడు కానీ అది ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు చందు మొండేటి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు."ఈ సినిమా నేను చేస్తే చాలా బాగుండేది అని అనిపించిన మూవీస్ లో ఏవైనా ఉన్నాయా అని హోస్ట్ అడిగేసరికి "రక్షకుడు అని నాగార్జున నటించిన మూవీ ఒకటి ఉంది. నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు ఈ మూవీ వచ్చింది. ఆ మూవీకి ఎంత హైప్ వచ్చిందో నాకు బాగా తెలుసు. సౌత్ లో అతి పెద్ద సినిమా ఇది. ఐతే అదే లెవె లో అది ప్లాప్ అయ్యింది.
అప్పుడు నాకు ఏమనిపించేది అంటే ఎలాగైనా మూవీ ఇండస్ట్రీలోకి వెళ్లి రక్షకుడు అనే టైటిల్ పెట్టి ఆయనతోనే మళ్ళీ మూవీ చేసి హిట్ కొట్టాలి అనేంత కసి ఉండేది. ఆయన నటించిన మూవీనే మళ్ళీ రీమేక్ చేయాలి అంటే చాలా మూవీస్ ఉన్నాయి. ఐతే అప్పట్లో అవి ప్లాప్ అని ఆడలేదు అన్న విషయం నాకు అప్పటికి తెలీదు. ఆయన ప్లాప్ మూవీస్ అన్నీ నాకు నచ్చినవే. చైతన్య, నేటి సిద్దార్థ, జైత్రయాత్ర, శాంతి - క్రాంతి ఈ మూవీస్ అన్నిటినీ రీమేక్ చేయాలనీ ఉంది. కిల్లర్ పర్లేదు అనిపించేలా ఆడింది. ఐతే కిల్లర్ మూవీ తీయాల్సి వస్తే గనక ఇప్పుడు అఖిల్ ని పెట్టి తీసి రిలీజ్ చేస్తా. హైదరాబాద్ నవాబ్స్ మూవీకి నేను, సుధీర్ వర్మ, నిఖిల్ ముగ్గురం అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నాం. నేను చెన్నైలో చదువుకున్నా. నాకు నాగార్జున అంటే ఇష్టం. ఆయన అన్ని సినిమాలు కూడా చూసాను" అని చెప్పాడు చందు మొండేటి.
![]() |
![]() |