![]() |
![]() |

వెబ్ సిరీస్: మహారాణి 3
నటీనటులు: హుమా ఖురేషీ, అమిత్ సియాల్, వినీత్ కుమార్, ప్రమోద్ పాతక్, ఖానీ కస్రుతి, అనూజ సాతే, సుషిల్ పాండే, దిబ్యేంద్ భట్టాఛార్య తదితరులు
రచన : సుభాష్ కపూర్
ఎడిటింగ్: కునాల్ వాల్వే
సినిమాటోగ్రఫీ: అనూప్ సింగ్
మ్యూజిక్: రోహిత్ శర్మ
నిర్మాతలు: సుభాష్ కపూర్
దర్శకత్వం: సౌరభ్ భావే
బ్యానర్: కంగ్రా టాకీస్
ఓటీటీ: సోని లివ్
కథ:
బీహార్ లో జరుగుతున్న పొలిటికల్ పార్టీల మధ్య గొడవని ఉద్దేశిస్తూ.. సీఎమ్ నవీన్ ప్రసంగం ఇస్తాడు. ఆ తర్వాత చనిపోయిన మాజీ సీఎమ్ గురించి అతని భార్యతో మాట్లాడి వెళ్ళిపోతాడు. మరోవైపు జైలులో ఉన్న మహారాణి (హుమా ఖురేషీ) తన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతుంటుంది. అదే సమయంలో మహారాణికి కోర్టులో హియరింగ్ ఉండటంతో తను కోర్ట్ కి వస్తుంది. అయితే తన పిల్లల్లోని మొదటి కొడుకు మాహారాణిని చూడటానికి నిరాకరిస్తాడు. అదే సమయంలో బీహార్ లో సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తున్నట్టుగా సీఎమ్ నవీన్ ప్రకటిస్తాడు. అయితే కొన్నిరోజులకి కొందరు దుండగులు అక్రమంగా బీహార్ మొత్తం మందు సప్లై చేస్తారు. ఆ తర్వాత వరుసగా పదవిలో ఉన్న కొంతమంది పొలిటికల్ లీడర్స్ చనిపోతారు. అసలు నవీన్ సీఎమ్ పదవికి అర్హుడేనా? మహారాణి జైలులో ఎందుకు ఉంది? పొలిటికల్ లీడర్స్ చావులకి మహారాణి, నవీన్ లకి మధ్యగల సంబంధమేంటనేది మిగతా కథ.
విశ్లేషణ:
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ కథ మెప్పిస్తుంది. జైలులో మహారాణి ఎందుకుంది? నవీన్ సీఎమ్ గా ఉండి ఏం చేశాడనే ఉత్కంఠతో మొదలైన ఈ సీజన్3 నచ్చుతుంది. అయితే స్లోగా సాగే సీన్లు కాస్త ఇబ్బంది పెడతాయి.
మొదటి రెండు సీజన్లు చూడనివారికి ఈ సీజన్3 అసలేం అర్థం కాదు. ఎందుకంటే బీహార్ లో.. 1990 నుండి సాగిన రాజకీయ పరిణామాలని ఒక్కో సీజన్ తో చూపించుకుంటు వచ్చారు. బీహార్ లో నవీన్ పట్నాయక్ సీఎమ్ గా ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఎన్నికలు వాటికి సంబంధించిన ప్రతీ వివరాలని మొదటి రెండు సీజన్ లలో చూపించారు. అయితే సీజన్2 లో మాహారాణి భర్త చనిపోవడంతో మహారాణి జైలుకెళ్ళాల్సి వస్తుంది. ఇక ఈ మూడవ సీజన్ లో కథ జైలు నుండే మొదలవుతుంది. అయితే ఓ సీఎమ్ వెనక ఎన్ని జరుగుతాయనేది? సీఎమ్ చుట్టూ సాగే ఈ పొలిటికల్ డ్రామా స్లోగా సాగుతుంది. ఇది ఒక టీవీ సిరీస్. అంటే సినిమాలని ఇష్టపడే వారికంటే సీరియల్స్ ని ఇష్టపడే వారికి ఇది మంచి కాలక్షేపమవుతుంది.
బీహార్ లో గన్స్, పాన్, సారా, బందిపోట్లు లాంటి వాటిని పొలిటికల్ పార్టీలోని కొంతమంది నాయకులు ఎలా వాడుకున్నారు.. ఈ రాజకీయ చదరంగంలో గెలుపోటములు సహాజమే అన్నట్టు సాగే ప్రతీ ఎపిసోడ్ క్యూరియాసిటిని కలిగిస్తుంది. అసభ్య పదజాలం వాడలేదు. అయితే ఒకటి, రెండు చోట్లు అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అవి స్కిప్ చూసేయొచ్చు. టైమ్ కల్పించుకొని ఓపికతో చూస్తే ఈ సిరీస్ నచ్చేస్తుంది. ఇద్దరు సరైన ఆటగాళ్ళు కలిసి ఆడే చెస్ గేమ్ ని తలపిస్తుంది. ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్‌లు ఉండటం ఒక్కో ఎపిసోడ్ ముప్పై నుండి నలభై నిమిషాల వరకు నిడివి కలిగి ఉండటంతో ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే పొలిటికల్ డ్రామాలని ఇష్టపడే వారికి ఈ సిరీస్ తప్పకుండా నచ్చేస్తుంది. రోహిత్ శర్మ మ్యూజిక్ బాగుంది. అనూప్ సింగ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కునాల్ వాల్వే ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
హుమా ఖురేషీ నటన ఈ సిరీస్ కి ఆయువుపట్టుగా నిలిచింది. ఇక నవీన్ గా అమిత్ సియాల్ ఆకట్టుకున్నాడు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా : కాస్త సాగదీతతో.. థ్రిల్ ని పంచే పొలిటికల్ డ్రామా.
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |