![]() |
![]() |

ఒక సినిమాని ప్రకటించేటప్పుడు మా సినిమాలో పలానా ఆర్టిస్ట్ లు ఉన్నారని చెప్తారు. విడుదల తేదీని కూడా చెప్తారు. అలాగే సినిమా ఫలితం ఎలా ఉన్నా ఓటిటి లో ఎప్పుడు వస్తుందో అనే విషయం కూడా చెప్తారు. కానీ ఇప్పుడు ఒక మూవీకి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. చెప్పకుండానే విడుదల చేసారు.అదేంటో చూద్దాం
వెన్నెల కిషోర్ హీరోగా వచ్చిన మూవీ చారి 111 . గత నెల మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పై యాక్షన్ కామెడీ గా తెరకెక్కిన చారి ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేక పోయింది. కథ లైన్ బాగానే ఉన్నా కథనంలోని లోపాల వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటిటి లో టెలికాస్ట్ అవుతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సైట్ లో దర్శనం ఇస్తుంది. కనీసం ఆ సంస్థ నుంచి కూడా సమాచారం లేదు.
.webp)
హైదరాబాద్ లో జరిగిన బాంబుపేలుళ్లకి కారణమైన వాళ్ళని పట్టుకునే సీక్రెట్ ఏజెంట్ చారిగా వెన్నెల కిషోర్ నటించాడు.సంయుక్త విశ్వనాధన్ హీరోయిన్ గా చేసింది.బ్రహ్మాజీ,మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. అదితి సోనీ నిర్మాతగా వ్యవహరించగా టి జీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు.ఇక చారి విడుదలకి ముందు పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలుస్తుంది.
![]() |
![]() |