![]() |
![]() |

కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలుగచేస్తాయి. ఆ తర్వాత రిలీజ్ దశలోను రిలీజ్ అయ్యాక కూడా క్యూరియాసిటీ ని కలిగిస్తాయి. అలాంటి మూవీస్ లో ఒకటి ఫ్యామిలీ స్టార్. (family star)తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ ప్రియుల్లో ఆకర్షణీయంగా మారింది.
విజయ్ దేవరకొండ (vijay devarakonda) హీరోగా తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి టాక్ ని పొందుతుంది. ఇక ఈ మూవీకి ఓటిటి పార్టనర్ ఫిక్స్ అయ్యాడు. టైటిల్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)అని వేశారు. దీంతో ఆఫ్ ది స్క్రీన్ ఫ్యామిలీ స్టార్ ఎప్పుడొచ్చినా సరే అమెజాన్ లో మెరవనుంది. గతంలో విజయ్ నటించిన చాలా చిత్రాలు అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ని నిర్మించాడు. విజయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో రూపొందింది. అందాల తార మృణాల్ ఠాకూర్(mrunal thakur) హీరోయిన్ గా చెయ్యడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. విజయ్ ,మృణాల్ నటన చాలా బాగుందనే టాక్ వినిపిస్తుంది. సాంగ్స్ కి కూడా థియేటర్ లో బాగున్నాయనే పేరు వస్తుంది.గీత గోవిందం ఫేమ్ గోపి సుందర్ సంగీతాన్ని అందించగా పరశురామ్(parasuram)దర్శకత్వాన్ని వహించాడు. మరి ఎన్నిరికార్డులు కొట్టి ఫ్యామిలీ స్టార్ ఓటిటి లోకి అడుగుపెడతాడో చూడాలి
![]() |
![]() |