![]() |
![]() |

`ఫిదా` (2017)లో జంటగా కనువిందు చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి. అంతేకాదు.. ఆ చిత్రంతోనే అటు వరుణ్, ఇటు పల్లవి తెలుగునాట తొలి ఘనవిజయాన్ని చవిచూశారు. అయితే, ఆ తరువాత ఈ ఇద్దరు కూడా జోడీకట్టింది లేదు. కాకపోతే, ఏడాది తిరిగేసరికి 2018 క్రిస్మస్ కి ఒకే రోజున తమ చిత్రాలతో బరిలోకి దిగారు. 2018 డిసెంబర్ 21న సాయిపల్లవి నాయికగా నటించిన `పడి పడి లేచె మనసు`, వరుణ్ హీరోగా నటించిన `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్` బాక్సాఫీస్ ముంగిట పోటీపడ్డాయి. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా విజయతీరాలకు చేరుకోలేకపోయాయి.
కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మళ్ళీ అదే క్రిస్మస్ బరిలో బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నారు ఈ `ఫిదా` స్టార్స్. ఆ వివరాల్లోకి వెళితే.. వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని` డిసెంబర్ 24న విడుదల కానుండగా.. అదే రోజున సాయి పల్లవి నాయికగా నటించిన `శ్యామ్ సింగ రాయ్` రిలీజ్ కానుంది. దీంతో.. మరోసారి సాయిపల్లవి వర్సెస్ వరుణ్ తేజ్ తప్పడం లేదు. మరి.. తొలిసారి పోటీపడిన సందర్భంలో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిన వరుణ్, పల్లవి.. రెండోసారి అయినా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |