![]() |
![]() |

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'ఆశ్రమ్' బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ 1 బిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేయడం విశేషం. ఒక ఆశ్రమాన్ని నడిపే బాబాగా బాబీ ప్రదర్శించిన అభినయం వీక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేందుకు ఈ వ్యూస్ నిదర్శనం. తమ్ముడు సాధించిన విజయానికి అన్నయ్య సన్నీ డియోల్ పొంగిపోయారు. బాబీని సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు అందజేశారు.
1 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన బాబీ డియోల్ ఉన్న 'ఆశ్రమ్' వెబ్ సిరీస్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన సన్నీ, దానికి ‘Bobbyyyyyyyyyyy’ అనే క్యాప్షన్ జోడించారు. బాబీ సాధించిన విజయం తనకు ఎంత ఆనందాన్నిచ్చిందో ఆ ఒక్క పదంతో ఆయన చెప్పారు. దీనికి బాబీ స్పందించాడు. కామెంట్ సెక్షన్‌లో అన్నయ్యకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.
'ఆశ్రమ్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా 'ఆశ్రమ్ 2'ను కూడా కొద్ది రోజుల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్‌లో రిలీజ్ చేశారు. అది కూడా మంచి వీక్షకాదరణ పొందుతోంది. కాగా తండ్రి ధర్మేంద్రతో కలిసి సన్నీ, బాబీ 'అప్నే 2' చేసేందుకు రెడీ అవుతున్నారు. 'అప్నే' (2007)కు సీక్వెల్‌గా రూపొందే ఈ మూవీలో సన్నీ కుమారుడు కరణ్ డియోల్ తెరంగేట్రం చేస్తున్నాడు.
![]() |
![]() |