![]() |
![]() |

శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నటి సంజనకు బెయిల్ లభించడంతో జైలు గదిలోనుంచి బయటకొచ్చి ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం ఆమెకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్యపరమైన కారణాలతో కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం గమనార్హం. పరంపన అగ్రహార సెంట్రల్ జైలులో రెండు నెలలుగా ఖైదీగా ఉంది సంజన. బెంగళూరులోని సంపన్న వర్గాలవారు పాల్గొనే పార్టీలకు డ్రగ్స్ సప్లై చేస్తోందనే అభియోగంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆమెపై కేసు నమోదు చేసింది.
రూ. 3 లక్షల పూచీకత్తు, అంతే మొత్తానికి రెండు సెక్యూరిటీలు సమర్పించే షరతుపై జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ ఆమెకు బెయిల్ ఆర్డర్ జారీ చేశారు. నెలకోసారి పోలీస్ స్టేషన్‌కు హాజరై, దర్యాప్తకు సహకరించాలని సంజనను ఆయన ఆదేశించారు.
రెండోసారి సంజన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో బెంగళూరులోని వాణివిలాస్ హాస్పిటల్ ద్వారా తరచూ మెడికల్ చెకప్ చేయాల్సిందిగా నవంబర్ ఆరంభంలో కోర్టు ఆదేశించింది. ఆమె తొలి బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 3న హైకోర్టు తిరస్కరించింది.
![]() |
![]() |