![]() |
![]() |

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొవిడ్-19 బారిన పడిన ఆయన నలభై రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వస్తున్నారు. మొదట కరోనా వైరస్‌తో తీవ్రంగా పోరాడిన ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యిందనీ, త్వరలోనే ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయనీ ఇంతకు ముందు వరకూ వార్తలు వచ్చాయి. బాలు వ్యాయామం కూడా చేస్తున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు కూడా.
కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఆయనకు కొన్ని రోజుల పాటు కృత్రిమ శ్వాస అందిస్తూ వచ్చారు. ఇప్పుడ అకస్మాత్తుగా ఆయన ఆరోగ్య స్థితి క్షీణించిందంటూ వార్తలు రావడంతో ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. కొద్దిసేపట్లో ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఆయన ఆరోగ్యంపై బులెటిన్‌ను వెలువరిస్తాయని చెబుతున్నారు.
![]() |
![]() |