![]() |
![]() |
ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్స్‌లో మంచి జోష్ మీద ఉన్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. అదే ఊపులో బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 109వ సినిమాగా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు ‘అభిమానులంతా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. మా బాలయ్య సినిమా ఎలా ఉండబోతోంది అని. వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నా, ఒక్కటే మాట ఇస్తున్నా.. బాలయ్యబాబుతో చేస్తున్న ఈ సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది. ఇటీవల ఊటీలో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. నెక్స్‌ట్ షెడ్యూల్ రాజస్థాన్‌లో ఉంటుంది. ఈ షెడ్యూల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే ఇస్తాను’ అన్నారు.
దర్శకుడు బాబీ చెప్పిన దాన్ని బట్టి బాలకృష్ణ క్యారెక్టర్ వేరే లెవల్‌లో ఉంటుందని అర్థమవుతోంది. ‘భగవంత్ కేసరి’ సాధించిన ఘనవిజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ దాన్ని మించిన సినిమా చెయ్యాలని బాబీని ప్రోత్సాహిస్తున్నారట. నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సమయంలో విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమాపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ‘బ్లడ్ బాత్‌కు బ్రాండ్ నేమ్.. వయలెన్స్‌కు విజిటింగ్ కార్డ్’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ అయిన ఆ పోస్టర్ చూస్తే బాబీ చెయ్యబోయే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమైంది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని, తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీటిపై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు .
![]() |
![]() |