![]() |
![]() |

ఎన్టీఆర్ నుంచి ఈ సంవత్సరం ఎలాంటి సినిమా రాలేదని బాధలో ఉన్న అభిమానులకి వచ్చే సంవత్సరం మాత్రం పండగే. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో హై టెక్నీక్ వాల్యూస్ తో రూపొందుతున్న దేవర శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకొని ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. అలాగే బాలీవుడ్ లో వార్ 2 అనే ఇంకో హై బడ్జట్ మూవీలో కూడా ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ అగస్ట్ 14 న థియేటర్ లలో ల్యాండ్ అవ్వనుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక చోటుకి వెళ్తు కెమెరాలకి చిక్కాడు.
ఎన్టీఆర్ లేటెస్ట్ గా తన భార్య పిల్లలతో కలిసి జపాన్ బయలుదేరి వెళ్ళాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తన ఫ్యామిలీ తో కలిసి జపాన్ లో చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయలు దేరి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ పిల్లలిద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత బయట కనపడేసరికి అక్కడ ఉన్న కొంత మంది తమ సెల్ ఫోన్స్ లో ఫోటోలు కూడా తీసుకున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తాడు.

దేవర ని ఎన్టీఆర్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా గుర్తుండిపోయేలా దర్శకుడు కొరటాల శివ రేయింబవళ్లు పని చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన జనతా గ్యారేజ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో దేవర మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఎన్టీఆర్ హిందీలో నటిస్తున్న ఈ మొట్టమొదటి చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.
![]() |
![]() |