![]() |
![]() |
.jpg)
తెలుగు చిత్రసీమలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఉన్న ఒకరిద్దరూ... అప్పుడప్పుడూ మెరుస్తుంటారు. వాళ్లలో అంజలి కూడా ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి చిత్రాలతో ఆకట్టుకొంది అంజలి. సీతమ్మకు నంది అవార్డు కూడా వచ్చింది. తెలుగమ్మాయి కదా.. అందుకే ఇప్పటి వరకూ కాస్త పద్ధతిగానే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే అంజలి శ్రుతిమించుతోందనిపిస్తోంది. తాజా చిత్రం చిత్రాంగద చూస్తే అంజలి ఏంటి? మరీ టూమచ్‌గా తయారైంది అనిపించకమానదు. ఈ సినిమాలో అంజలి లెస్బియన్‌గా నటించి షాక్ ఇచ్చింది. ఆమె హావభావాలు మరీ ఓవర్ అనిపించాయి.
అంతే కాదు... ఈ సినిమాలో చాలా లావుగా కనిపించింది అంజలి. తొడలు కనిపించేలా డ్రస్సులు వేసుకొని ఊరించే ప్రయత్నం చేసింది. అయితే... అవి హీట్ పెంచాల్సింది పోయి వికారం కలిగించాయి. అంజలి లావు తగ్గాల్సిన అవసరం ఉందని, లేదంటే.. ఆమె కెరీర్‌కి పుల్ స్టాప్ పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అంజలి కొన్ని ప్రెస్ మీట్లకు హాజరైంది. అప్పుడూ ఇలానే బొద్దుగా కనిపించింది. అంజలి యుద్ద ప్రాతిపదికమీద ఒళ్లు తగ్గించకపోతే.. చిత్రాంగదే ఆమె ఆఖరి సినిమా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
![]() |
![]() |