Home  »  News  »  బాల‌య్య బ‌ర్త్ డే కి.. `అఖండ‌` `డ‌బుల్ ధ‌మాకా` ట్రీట్?

Updated : May 22, 2021

`సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ ఎంట‌ర్టైన‌ర్స్ స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `అఖండ‌`.  `సింహా`, `లెజెండ్` త‌ర‌హాలోనే ఇందులోనూ బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ రెండు పాత్ర‌ల‌కి సంబంధించి వేర్వేరు వీడియోల‌ను రిలీజ్ చేసింది యూనిట్.  గ‌త ఏడాది బాల‌య్య పుట్టిన‌రోజు స్పెష‌ల్ గా `#BB3 First Roar ` పేరుతో  ఓ వీడియోని విడుద‌ల చేయ‌గా.. ఈ ఏడాది ఉగాది సంద‌ర్భంగా `#BB3 Title Roar` పేరుతో మ‌రో వీడియోని రిలీజ్ చేశారు. ఈ రెండు వీడియోల‌కి కూడా యూట్యూబ్ లో మంచి స్పంద‌న వ‌చ్చింది.

క‌ట్ చేస్తే.. ఈ జూన్ 10న బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా `అఖండ‌` టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. అంతేకాదు.. ఈ టీజ‌ర్ లో బాల‌య్య రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన `డ‌బుల్ ధ‌మాకా` విజువ‌ల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అలాగే హీరోయిన్స్ ప్ర‌గ్యా జైశ్వాల్, పూర్ణ‌కి సంబంధించిన విజువ‌ల్స్ కూడా ఇందులో పొందుప‌రిచిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే `అఖండ‌` టీజ‌ర్ కి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. `అఖండ‌`తో బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.