Home  »  News  »  "నీ శాస్త్రీయత, నీ తొక్కలో ఎటకారం ఇప్పుడే గుర్తొచ్చాయా?".. ఏకిపారేసిన ర‌ఘు కుంచే

Updated : May 22, 2021

 

క‌రోనాకు విరుగుడు మందు ఇస్తున్న నెల్లూరు కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య ఇంటికి వేలాదిగా జ‌నం త‌ర‌లి వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఆనందంయ్య మందు గురించి తెలుసుకున్న చుట్టుప‌క్క‌ల వారే కాకుండా ఇత‌ర రాష్ట్రాల వారు కూడా వెళ్తుండ‌టంతో అక్క‌డ జ‌న‌ప్ర‌వాహం జాత‌ర‌ను త‌ల‌పిస్తోంది. ఒక‌ర్నొక‌రు రాసుకుంటూ క్యూల‌లో నిల‌బ‌డ్డ జ‌నం ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

వీటిని చూసి, కొంత‌మంది గుండెలు బాదుకుంటున్నారు. నెల్లూరు ఏమైపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. దీని వ‌ల్ల క‌రోనా విజృభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాపోతున్నారు. ఇలాంటి వారిపై సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచే మండిప‌డ్డారు. ఇంత‌కు ముందు ఆనంద‌య్యను మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఒక పోస్ట్ పెట్టిన ఆయ‌న ఇప్పుడు గొర్రెల మంద‌లా ఆనంద‌య్య మందు కోసం వెళ్తున్నార‌ని వెట‌కారం చేస్తున్న వారిని త‌న ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా ఏకిపారేశారు.

ఆయ‌న ఏం రాశారో య‌థాత‌థంగా ఇక్క‌డ ఇస్తున్నాం...

"ఆ చదువురాని  గొర్రెలు పండిస్తేనే మనం తింటున్నాం.... ఆ చదువురాని గొర్రెలు ఓటు వేస్తేనే మనం గెలుస్తున్నాం....
ఆ చదువురాని గొర్రెలు అభిమానిస్తేనే మనం ' Celebrities ' అని Tags తగిలించుకుని మరీ Feel అవుతున్నాం......
చిన్నప్పుడు మా ఊరిలో ఒక సామెత బాగా వినేవాడిని "చదవేస్తే ఉన్న మతి పోయిందట " అని..
ఆ సమయంలో  చదువుని ఎటకారం చేస్తుంటే కోపం వొచ్చేది... ఇప్పుడు కొంత మంది మేధావులుని చూస్తున్నపుడు ఆ సామెత నిజమే కదా అనిపిస్తుంది .
విషయానికొస్తా ...
తరతరాలుగా నమ్మకానికి , సైన్సుకి మధ్య ఉన్న పోరాటాన్ని డిసైడ్ చేసేది  చదువు మాత్రమే కాదు, ఇక్కడ  కేవలం అవసరం, ఆశ.
ఆ రెండు మనిషిని ఎంతకైనా  తెగించేలా చేస్తాయి... ఇప్పుడు ఇక్కడ ఉన్నది మిణుకు మిణుకుమంటున్న మనిషి  ప్రాణాలకి సంబందించిన ఒక ఆశ...
మీ భాషలో  "HOPE".
ఆ ప్రాణాన్ని ఎక్కడో ఒక “తీగో ,ఆకో ,పసరో, గింజో  “ కాపాడుతుంది అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ దొరక్కో , ప్రవేట్ హాస్పటల్లో చేరి లక్షలకి లక్షలు కట్టే  స్థోమత లేకో, ఆ సమయంలో ఎక్కడో ఎవరో ఉచితంగా ఇచ్చే మందు వల్ల ప్రాణం నిలబడుతుంది అనే ఆశతో ఎంత దూరమైనా పరిగెత్తే వాళ్ళ  నేరం ఏంటో ఒకసారి చెప్పండి?
సరే ...
వాళ్ళ ఆత్రంతో, ప్రాణాలు కాపాడుకోవాలి అనే భయంతో భౌతిక దూరాన్ని పాటించడంలేదు శాస్త్రీయ‌త‌ గురించి తెలియదు, కేవలం మూర్ఖత్వం, మూఢ నమ్మకం అనే అనుకుందాం!
Ok i agreed.
మరి విడుదలైన మొదటి రోజు పొద్దున్నే సినిమాలకి, రాత్రి పూట pub లకి, pravate పార్టీలక , House పార్టీలకి, function లకి  వెళ్ళినపుడు మనం కూడా ఓఓ అంటూ Hug లతో ముద్దుల్తో వొళ్ళు వొళ్ళు రాసేసుకుంటాo కదా..? ఇవన్నీ 2020 / 21 లో కూడా జరిగాయి కదా.. కరోనాని  అంటించుకున్నారు కదా చాలామంది.. 
దాన్నేమనాలి? ఏమన్నా అంటే ....
What the heckkkk
What the F...
What’s Happening Der?
omg ఏం జరుగుతుంది ఈ దేశంలో? 
ఈ జనం ఇంతే మారరు. వీళ్ళు  గొర్రెలు, మూర్ఖులు Etc Etc .....
ఇలాంటి 'Free Expressions' Emoji లు, దెబ్బతిన్న మీ మనోభావాలు Type చెయ్యడానికో, Troll చెయ్యడానికో, మీ దృష్టిలో చాలా బలంగానూ శాస్త్రీయంగాను ఉంటాయి. 
కానీ ....
ఇప్పుడు ఆ చదువు రాని, శాస్త్రీయత తెలీని గొర్రె తన పేద ప్రాణాన్ని నిలుపుకోడానికో, ఎవరినో నమ్మి గుండెని అరచేత్తో పట్టుకుని ఎక్కడికో బిక్కు బిక్కు మంటూ పరిగెడుతుంటే... 
నీకు నీ శాస్త్రీయత, నీ తొక్కలో ఎటకారం ఇపుడే గుర్తొచ్చాయా?
వాళ్ళని  నువ్వు ఎందుకు proper గా Educate చెయ్యవ్? నీకా బాధ్యత లేదా? దెప్పుతావెందుకు .
వీలైతే నువ్వక్కడికి వెళ్లి మైక్ పట్టుకుని హెచ్చరించు, అవకాశం లేదు అనుకుంటే, మనం పొద్దున్న లెగిసిన కాడినుంచి మన మనో భావాలని, మన future Analysis ని, మన సంస్కారాన్ని స్వేచ్ఛగా విప్పి చూపించుకునే అవకాశాన్ని ఇచ్చిన ఈ Fecebook ,Twitter , insta whatsap తదితర 'ఉచిత ' మాధ్యమాల నుంచి వాళ్ళకి అర్థం అయ్యేలా భౌతిక దూరం, mask, శుభ్రత గురించి వివరంగా ఓపిగ్గా వాళ్ళకి అర్థ‌మయ్యేలా  తెలియచేయ్... కొంతమందికైనా చేరుద్దిగా మీ సందేశం.
ఏం.. కేవలం ప్రభుత్వాలకేనా ఆ బాధ్యత? మనకి లేదా?  ఇంటికో పోలీసుని పెట్టలేవుగా ప్రభుత్వాలు మాత్రం?
Explain చెయ్యండి sir & Madam ... చెప్పండి ఎలుగెత్తి. 
అందరు బాగా చదుకున్నవాళ్ళేగా, మేధావులo అని మీకు మీరే ఒక self Tag ని  మనసులో వేసుకుని తిరిగేవాళ్ళేగా.
చెప్పండి ..... 
"మీరనుకునే " ఆ చదువులేని గొర్రెలకి అర్థం అయ్యేలా, గొంతెత్తి మరీ చెప్పండి ...
తప్పేముంది?
ఈ సమయంలో Ego లు దెబ్బతీసుకోడాలు, ఒకరి మీద ఎటకారపు యుద్దాలు, లేదా లేచిన దగ్గరనుంచి అధికార పక్షం మీదో, ప్రతి పక్షంమీదో బురదలు చల్లుకోడాలు  ఎందుకు ...? అవతల వాళ్ళది కూడా  ప్రాణమే కదా.... 
వీలైతే సహాయం చేద్దాం, అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి Free గా వొచ్చే సందేశం అయినా పంపిద్దాం. 
అంతే కానీ ఈ satire లు ఎందుకు, వాళ్ళమీద చిరాకు ఎందుకు? 
వాళ్ళు  మీలా మనిషులేగా? ఏం ..? చెప్పలేరా proper గా  కష్టమా? సర్లెండి.
అర్ధం చేసుకోగలను  మిమ్మల్ని, మీ పరిస్థితిని, మీ అసహనాన్ని.
నేను మాత్రం మీకు ఇంకేం చెప్పగలను..  
God bless you, Stay safe, మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి అని మాత్రం చెప్పగలను.
ఉంటాను Brother, Madam & Sir 
                               ....రఘు కుంచే"






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.