![]() |
![]() |
.jpg)
తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్ళిన చిత్రాల్లో `అన్నమయ్య` (1997) ఒకటి. కథానాయకుడిగా `కింగ్` నాగార్జున, దర్శకుడిగా కె. రాఘవేంద్రరావు, స్వరకర్తగా ఎం.ఎం. కీరవాణికి శిఖరాగ్ర స్థాయి గుర్తింపుని తీసుకువచ్చిన ఈ అపూర్వ ఆధ్యాత్మిక చిత్రం.. ఎనిమిది `నంది` పురస్కారాలు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రెండు జాతీయ పురస్కారాలు అందుకుని అవార్డుల పంట పండించింది. ఇందులో `అన్నమయ్య`గా టైటిల్ రోల్ లో నాగ్ నటించగా.. శ్రీ వేంకటేశ్వర స్వామిగా సుమన్ దర్శనమిచ్చారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ, కస్తూరి, భానుప్రియ, శ్రీకన్య, రోజా, ఎం. బాలయ్య, శుభ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, మల్లికార్జునరావు, ఏవీయస్, శివపార్వతి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ఆడియో పరంగా సంచలనం సృష్టించిన `అన్నమయ్య`లో బిట్ సాంగ్స్ తో సహా మొత్తం 20 గీతాలున్నాయి. వాటిలో 16 పాటలు అన్నమయ్య కీర్తనలతోనే రూపొందగా.. మూడు పాటలను దిగ్గజ రచయిత వేటూరి, ఒక గీతాన్ని జేకే భారవి రచించారు. వీఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మించిన `అన్నమయ్య`.. 1997 మే 22న విడుదలై జననీరాజనాలను అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలనూ పొందింది. నేటితో ఈ క్లాసిక్.. 24 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |