![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ - అభినేత్రి సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అన్నీ కమర్షియల్ గా భలేగా వర్కవుట్ అయ్యాయి. వాటిలో `ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు` ఒకటి. `తన శ్రీమతిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కథానాయకుడు.. అనూహ్య పరిస్థితుల్లో మరొకరిని పెళ్ళాడతాడు. ఆపై వీరి కథ ఏ తీరాలకు చేరింది?` అనే పాయింట్ తో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో వినీత మరో హీరోయిన్ గా నటించింది. హాస్య చిత్రాలకు చిరునామాగా నిలిచిన దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబూమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
కోటి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. ``బోల్ బోల్ బోల్ రాజా``, ``ప్రియురాలే ప్రేమగా``, ``చిలకతో మజా``, ``అమ్మనే అయ్యానురా``, ``పాపరోయ్ పాప్``, ``ఓలమ్మి తిమ్మిరి``.. ఇలా ఇందులోని గీతాలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మించిన ఈ చిత్రం.. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `తాయికులమే తాయికులమే` ఆధారంగా తెరకెక్కింది. 1996 మే 22న విడుదలై అఖండ విజయం సాధించిన `ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు` నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |