![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున.. ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ కూడా ఇటీవల `60+` క్లబ్ లో జాయిన్ అయ్యారు. అయినప్పటికీ కుర్రకారుతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ ఇద్దరు.. కొత్త సినిమాల కోసం నేచురల్ లుక్స్ లో కనిపించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఒక పాత్ర కోసం విగ్ లేకుండా సహజంగా కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్ బజ్.
ఇక నాగార్జున విషయానికొస్తే.. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్న విషయం విదితమే. ఈ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా, కనీసం హెయిర్ కలర్ కూడా వాడకుండా నేచురల్ లుక్ తోనే దర్శనమివ్వబోతున్నారట కింగ్. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా చెప్పడం విశేషం.
మరి.. నేచురల్ లుక్స్ తో సీనియర్ స్టార్స్ ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |