![]() |
![]() |

`ఉప్పెన`తో దర్శకుడిగా తొలి అడుగేశాడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. మొదటి ప్రయత్నంలోనే గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ ని ఓ పిరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా చేయబోతున్నట్లు టాక్. అంతేకాదు.. ఇందులో యంగ్ టైగర్ యన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `దంగల్` (ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రధారి) ఛాయలతో బుచ్చి బాబు ఈ క్రీడా నేపథ్య చిత్రానికి కథను అల్లుకున్నాడని.. 60 ఏళ్ళ రిటైర్డ్ అథ్లెట్ పాత్రలో తారక్ కనిపిస్తాడని బజ్. కాకపోతే సినిమా సింహభాగం హీరో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో నడుస్తుందని వినికిడి. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, యన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా పిరియడ్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లోనూ, `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తోనూ తారక్ తన తదుపరి చిత్రాలు చేయనున్నాడు.
![]() |
![]() |