![]() |
![]() |

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. కె.వి. అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్‌పై టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి షోతో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుని మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఈ టీమ్‌ని రానా తన టాక్ షోకి ఆహ్వానించాడు. రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో 'నెం.1 యారి'. ఇప్పటి వరకు సీజన్ 1, సీజన్ 2 సూపర్ సక్సెస్ అయింది. తాజాగా రానా సీజన్ 3ని జెమినీలో కాకుండా 'ఆహా'లో స్టార్ట్ చేస్తున్నాడు. ఈ నెల 14 నుంచి ఈ షో 'ఆహా'లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రారంభ ఎపిసోడ్ కోసం రానా 'జాతిరత్నాలు' టీమ్ నాగ్ అశ్విన్, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలని ఆహ్వానించాడు.
ఈ నలుగురిలో ముగ్గురు 'జాతిరత్నాలు' నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కోతులుగా మారి రానాతో నానా రచ్చ చేశారు. నవీన్ "బాహుబలి సినిమా తెలుసండీ మీకు?" అని అడిగితే, "తెలుసండీ.. చూశాను." అని రానా సీరియస్‌గా జవాబిచ్చాడు. "బాహుబలి నథింగ్ సార్.. జాతిరత్నాలు ముందు కంపేర్ చేస్తే.." అని రాహుల్ రామకృష్ణ సీరియస్‌గా చెప్తే, "సూపర్ జోక్ నాన్నా." అన్నాడు రానా. అందరూ ఘొల్లున నవ్వేశారు.
అంతేనా.. డేటింగ్ గురించి పెద్ద రచ్చే చేశారు. "నవీన్ ఒక సూపర్ హీరోని పెళ్లి చేసుకోవాలంటే.." అని రానా అడిగితే "ఏముందీ యాదమ్మ" అంటూ ప్రియదర్శి టక్కున చెప్పేయడంతో అంతా మరోసారి పెద్దగా నవ్వేశారు. రేపటి నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారి సందడి చేస్తోంది.

![]() |
![]() |