![]() |

టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాడా పెళ్లికి సిద్ధమవుతోంది. హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్ధం శుక్రవారం జరిగింది. కొద్ది రోజుల క్రితమే అతనితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించింది మెహ్రీన్. అతనితో కలిసున్న ఫొటోలను కూడా షేర్ చేసుకుంది. జోధ్‌పూర్‌లో వారి ఎంగేజ్‌మెంట్ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని పిక్చర్స్‌ను మెహ్రీన్ సోదరుడు గుర్‌ఫతే సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. వాటిలో ఓ పిక్చర్‌లో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, కుర్చీల్లో కూర్చొని, చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతికొద్దిమంది సన్నిహిత బంధువులు మాత్రమే హాజరయ్యారు.

భవ్య బిష్ణోయ్ ఎవరో కాదు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు. ప్రస్తుత హిసార్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కుమారుడు.
.jpg)
'ఎఫ్ 2' మూవీలో మెహ్రీన్ అక్కగా నటించిన తమన్నా, మరో తార కల్యాణీ ప్రియదర్శన్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మెహ్రీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
.jpg)
2016లో నాని సరసన నటించిన హిట్ మూవీ 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' ద్వారా నటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన మెహ్రీన్, ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, ఎఫ్ 2, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వథ్థామ చిత్రాల్లో నటించింది. అలాగే పంజాబీ, హిందీ, తమిళ చిత్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం 'ఎఫ్ 3'లో వరుణ్ తేజ్ జోడీగా మరోసారి నటిస్తోంది.
![]() |