![]() |
![]() |

అవసరమైతే సినిమా టికెట్ రేట్లు తగ్గించడానికి సినిమా ఇండస్ట్రీ సుముఖంగా ఉంది. ప్రస్తుతం కరోనా దెబ్బకు ఏప్రిల్ నెలలో థియేటర్ల డోర్లు తెరుచుకోలేదు. మార్చి నెల మధ్యలో థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికి ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసినా ఇంతకు ముందులా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అన్నది అనుమానమే. సమూహాలుగా, గుంపులుగా ఏర్పడితే ఒకరి నుండి మరొకరికి కరోనా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉండటంతో థియేటర్లకు ఎంతమంది ప్రజలు వస్తారన్నది ఇండస్ట్రీ అంచనా వేయలేకపోతోంది. అందుకని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చర్చిస్తోంది. ఈ క్రమంలో టికెట్ రేట్లు తగ్గిస్తే ఎలా ఉంటుందని కొందరు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నలుగురు సభ్యులు ఉన్న ఓ కుటుంబం ఒకసారి సినిమా చూడటానికి వెళితే మినిమమ్ వెయ్యి రూపాయలు అవుతోంది. మల్టీప్లెక్స్ అయితే రెండు వేల రూపాయల నోటు వదులుతుంది. అందుకని, చాలామంది థియేటర్లకు వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో మరింత ఆలోచిస్తారు. అందుకని, ప్రేక్షకులను ఆకర్షించడానికి అవసరమైతే టికెట్ రేట్లు తగ్గించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు అదే మాట చెప్పారు అవసరమైతే టికెట్ రేట్లు తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. లాక్ డౌన్ ఎత్తేశాక ఏం జరుగుతుందో చూద్దాం.
![]() |
![]() |