![]() |
![]() |

సుప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ఠ పుత్రుడు, నటుడు రాజా చెంబోలు (రాజా భవాని శంకర శర్మ) ఓ ఇంటివాడయ్యాడు. అతని వివాహం వెంకటలక్ష్మి హిమబిందుతో అక్టోబర్ 31 ఉదయం 10:55 గంటలకు హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు చిత్రసీమ నుంచి త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు, అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని లాంటి నిర్మాతలు, రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.


రాజా నటుడిగా వి, చాణక్య, రణరంగం, మిస్టర్ మజ్ను, అంతరిక్షం, నా పేరు సూర్య, ఫిదా, ఎవడు తదితర చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాడు. 'ఫిదా' చిత్రంలో వరుణ్ తేజ్ అన్నగా సాఫ్ట్ రోల్‌తో ఆకట్టుకున్న అతను.. శర్వానంద్ 'రణరంగం'లో విలన్‌గా భిన్న పాత్ర చేసి మెప్పించాడు.



![]() |
![]() |