![]() |
![]() |

కట్టుకున్న భార్యను కొట్టడం గృహహింస కిందకు వస్తుంది. కానీ, కొంతమంది చేయి చేసుకుంటూ ఉంటారు. భర్త కాబట్టి కొట్టినా తిట్టినా కొందరు మౌనంగా భరిస్తారు. మరికొంతమంది ఎదురు తిరుగుతారు. సమాజంలో అటువంటి ఘటనలు కొన్నిటిని ప్రజలు చూస్తున్నారు. సినీ రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఆ ఘటనలకు సినిమాల్లో చోటు కల్పిస్తున్నారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘కలర్ ఫొటో’లో ఎస్సై రామరాజు పాత్రలో సునీల్ నటించారు. ఓ సన్నివేశంలో భార్యగా నటించిన శ్రీవిద్యను చేయి చేసుకునే సన్నివేశం ఉంది. దానిపై ఓ నెటిజన్ శ్రీవిద్యను ప్రశ్నించారు.
‘‘సునీల్‌గారు మిమ్మల్ని కొట్టే సీన్ ని మీరు అబ్జక్ట్ (అభ్యంతరం) చేయలేదా?? స్ర్కిప్ట్ కి వేల్యూ ఇచ్చి ఆ సీన్‌కి ఒప్పుకున్నారా?’’ అని శ్రీవిద్యను ఒకరు ప్రశ్నించారు. అందుకు బదులుగా ‘‘అది అబ్జక్షనబుల్ సీన్ కాదు’’ అని చెప్పారామె. సునీల్ కొట్టడంలో అభ్యంతరం లేదని చెప్పారన్నమాట.
సునీల్ గురించి శ్రీవిద్య మాట్లాడుతూ ‘‘ఆయన నుండి నేర్చుకోవలసినది ప్రొఫెషనలిజమ్. పని పట్ల గౌరవం’’ అని చెప్పారు. ‘కలర్ ఫొటో’ కోసం యూనిట్ చాలా కష్టపడిందని ఆమె తెలిపారు. తన పాత్ర కంటే తనకు హర్ష చెముడు (వైవా హర్ష) నటించిన బాలయేసు పాత్ర అమితంగా నచ్చిందన్నారు.
.jpg)
![]() |
![]() |