![]() |
![]() |
కెరీర్ ప్రారంభం నుంచీ హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తనలోని గ్లామర్‌ని ఎక్స్పోజ్ చేస్తూ కుర్రకారుని హుషారెక్కిస్తోంది. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రంలో బోల్డ్ సీన్స్‌తో, లిప్‌లాక్స్‌తో యూత్‌కి నిద్ర లేకుండా చేసింది. తన సినిమాలతోనే కాదు, సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉండే అనుపమ.. తాజాగా ఓ పోస్ట్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే.. ఒక రోడ్ రోలర్‌తో మసాజ్ చేసుకునే ఫోటోను షేర్ చేసింది. ‘ఇలాంటి మాసాజ్ కావాలి’ అంటూ కామెంట్ పెట్టింది. అసలు కారణం ఏమిటంటే.. చాలా కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న అనుపమ అది తగ్గకపోవడంతో ఆ నొప్పి తగ్గాలంటే ఇలాంటి మసాజ్ కావాలంటూ ఆ ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో ఒక వ్యక్తి పడుకొని ఉంటే అతనిపై రోడ్ రోలర్ ఎక్కినట్టుగా కనిపిస్తోంది. అనుపమ చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోను కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఫన్నీ రియాక్షన్ ఇస్తున్నారు.
![]() |
![]() |