![]() |
![]() |

హన్సిక మోత్వానీ (Hansika Motwani) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం '105 మినిట్స్'. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. సింగిల్ క్యారెక్టర్ తో, సింగిల్ షాట్ లో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందులేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. కానీ '105 మినిట్స్' మాత్రం ఏకంగా నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు "ఆ భయం వెనకున్న కారణం ఎవరు? ఆ మిస్టరీ వెనకున్న మెయిన్ పర్సన్ ఎవరు?" అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ని వదిలింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

రుద్రాంశ్ సెల్యులాయిడ్, మాంక్ ఫిల్మ్స్ నిర్మించిన '105 మినిట్స్' సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ బోయిడపు, ఎడిటర్ గా శ్యామ్ వడవలి వ్యవహరించారు.
![]() |
![]() |