![]() |
![]() |

ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ (brahmaji)కి సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం మూడు దశాబ్డల పైనే. లెక్కకు మించిన సినిమాల్లో మంచి మంచి పాత్రలు వేస్తు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. ఒకప్పడు హీరోగా చేసిన ఘనత కూడా ఆయన సొంతం. తాజాగా కూటమి గెలుపు పై తన అభిప్రాయాన్ని వెల్లడి చేసాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
మొన్న ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపీ సారథ్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కానీ బ్రహ్మాజీ మాత్రం చాలా వెరైటీ గా ట్వీట్ చేసాడు. అందరు ఎలాంటి ఫలితాలు కావాలని ఎదురుచూసారో అలాంటి ఫలితాలు వచ్చాయి. బాగానే ఎంజాయ్ చేసాం. ఇక చాలు.. ఏపీ ప్రస్తుతం సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. ప్రజలు ఇక తమ పనులు చేసుకుంటు భవిష్యత్తుపై ఫోకస్ చెయ్యాలి.
ఓడిన వారిని ట్రోల్ చేయడం మానుకోవాలి. వాళ్లు గతంలో తప్పు చేశారని మళ్లీ మీరు అదే తప్పు చేయకూడదు కదా! మంచి భవిష్యత్తు కోసం మన కోసం మనం పని చేద్దాం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. బ్రహ్మాజీ ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |