![]() |
![]() |

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'అద్భుతం', 'WWW' సినిమాలతో ఓటీటీలో అలరించిన ఆమె.. ప్రస్తుతం 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ తో పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడీ యంగ్ బ్యూటీ మిస్ ఇండియా రేస్ కి రెడీ అయింది.
ఫెమినా మిస్ ఇండియా-2022 ఆడిషన్స్ లో శివాని పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఆమె.. ఆడిషన్స్ లో తన వంతు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చానని చెప్పింది. ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు కృతఙ్ఞతలు తెలిపిన శివాని.. ఈ కొత్త ప్రయాణంలో అందరి ఆశీస్సులు కావాలని కోరింది. మిస్ ఇండియా రేసులో శివాని ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.
తన తండ్రి రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' మూవీ లోనూ శివాని కీలక పాత్రలో నటించింది. తన తల్లి జీవిత డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |