![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో మరపురాని పౌరాణిక చిత్రాలెన్నో ఉన్నాయి. వాటిలో `భీష్మ` ఒకటి. మహాభారతంలోని భీష్మ జీవితం ఆధారంగా ఈ మైథలాజికల్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇందులో టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో అలరించారు ఎన్టీఆర్. ఆయన పాత్రకు నాయికగానీ, పాటలుగానీ లేకపోవడం విశేషం. బి.ఎ. సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అంజలీ దేవి, కాంతారావు, రేలంగి, హరనాథ్, శోభన్ బాబు, గుమ్మడి, నాగభూషణం, ధూళిపాళ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, వంగర, సీఎస్ఆర్, పేకేటి శివరామ్, సూర్యకాంతం, జి. వరలక్ష్మి, సుశీల, మల్లేశ్వరి, నిర్మలమ్మ, మాస్టర్ నాగరాజు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
సాలూరి రాజేశ్వరరావు సంగీతమందించిన ఈ చిత్రానికి ఆరుద్ర సాహిత్యమందించారు. ఇందులోని పాటలు, పద్యాలు ప్రజాదరణ పొందాయి. ఘంటసాల, పి. సుశీల, పీబీ శ్రీనివాస్, జమునా రాణి, ఎస్. జానకి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర రావు, ఆకుల వీటిని ఆలపించారు. 1962 ఏప్రిల్ 19న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `భీష్మ`.. నేటితో 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |