![]() |
![]() |
.webp)
ప్రభాస్ (prabhas)ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎవరు కూడా తమ జీవితంలో డిసెంబర్ 22 డేట్ ని మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజున సలార్ (salaar)రిలీజ్ అయ్యి కలెక్షన్స్ ల సునామి ని సృష్టించడంతో పాటుగా వరుస పరాజయాల బాటలో ఉన్న ప్రభాస్ కి అదిరిపోయే హిట్ ని కూడా సలార్ ఇచ్చింది.అంతే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం కూడా చేసింది. తాజాగా భారతీయులందరు గర్వపడే వార్త ఒకటి సలార్ నుంచి వచ్చింది.
సలార్ మూవీ లాటిన్ అమెరికాలో స్పానిష్ భాషలో మార్చి 7న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. దీంతో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో రిలీజ్ కానున్న సలార్ తో ప్రభాస్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.బాహుబలితో వరల్డ్ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన ప్రభాస్ ఇప్పుడు తన సలార్ తో మరింతగా పేరు సంపాదించడం ఖాయం.

ఇప్పుడు ఈ వార్తలపై ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.అలాగే పలువురు చిత్ర ప్రముఖులు కూడా ప్రభాస్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
![]() |
![]() |