![]() |
![]() |

'జబర్దస్త్' షో ద్వారా యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ ఎంతగా పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. దశాబ్దం పైగా పనిచేసిన అలాంటి షోను ఆమె వదిలేసింది. టాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తుండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆమె స్టార్ మా చానల్ కోసం రెండు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన 'రంగస్థలం', 'పుష్ప' సినిమాలు నటిగా ఆమె ఇమేజ్‌ను పెంచాయి.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం గురజాడ అప్పారావు ప్రఖ్యాత నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా అదే పేరుతో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి సంతకం చేసింది అనసూయ. త్వరలోనే దీని షూటింగ్ మొదలు కానున్నది. ఈ సిరీస్‌లో ఆమె వేశ్య మధురవాణి పాత్రను పోషించనుంది. ఒకప్పుడు వెండితెరపై వచ్చిన 'కన్యాశుల్కం'లో ఆ పాత్రను మహానటి సావిత్రి పోషించి, గొప్ప పేరును సంపాదించుకున్నారు. అలాంటి పాత్రను పోషించే అవకాశం ఇప్పుడు అనసూయకు లభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నది. ఈ సిరీస్‌ను డైరెక్టర్ క్రిష్ నిర్మించనున్నారు.
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా అనసూయకు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళం సినిమా చేస్తోంది. ఎక్కువగా ఆమె విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపుతోంది.
![]() |
![]() |