![]() |
![]() |
కోలీవుడ్ హీరోలలో అజిత్‌కి సక్సెస్ రేట్ ఎక్కువనే చెప్పాలి. ఈమధ్యకాలంలో వరస విజయాలతో దూసుకెళుతున్న అజిత్ తన కొత్త సినిమా ‘విడాముయర్చి’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. మగిల్ తిరుమనేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అజర్‌బైజాన్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా అసిస్టెంట్ కెమెరామెన్ మృతి చెందడంతో షూటింగ్‌ని అప్పటికప్పుడు నిలిపివేశారు. ఆరోజు నుంచి ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం పాటు చేయలేదు. దాంతో ఈ సినిమాను పక్కన పెట్టారన్న వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. షూటింగ్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే మళ్లీ షూట్ మొదలుపెట్టారు. ఇటీవల అజిత్ చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించడంతో అజర్ బైజాన్ షూటింగ్ కోసం అతను బయలుదేరినట్టు తెలుస్తోంది. యూనిట్ సభ్యులు ఇప్పటికే స్పాట్‌లో ఉన్నారు. షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. అజర్ బైజాన్ షెడ్యూల్ టోటల్‌గా పూర్తి చేసాక చెన్నైలో కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాని విడుదల చెయ్యాలన్నది వారి ప్లాన్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యమైంది. దీంతో ఇకపై నాన్‌స్టాప్‌గా షూటింగ్ చెయ్యాలని యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల అజిత్‌కు కొన్ని సమస్యలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ ప్రకారం షూటింగ్ చేయకపోవడం వల్ల అదనంగా డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీంతో అతని తదుపరి సినిమాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత అజిత్ చేసే సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్ కూడా పూర్తయింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నార. ఇప్పుడు విడాముయర్చి షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అతని తదుపరి సినిమా కూడా లేట్‌గానే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.
![]() |
![]() |