![]() |
![]() |
అడివి శేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ విభిన్నంగా ఉంటూ ఆడియన్స్‌ని థ్రిల్ చేసినవే. తన ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ కంటెంట్ ఉండాలని చూసే శేష్ ఇప్పుడు మరో కొత్త తరహా సినిమాకు శ్రీకారం చుట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతిహాసన్ హారోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను సుప్రియ చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే... పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత. అమెరికాలో పుట్టి, పెరిగిన షానియల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు డియో. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ‘లైలా’ షార్ట్ ఫిలింకు షానియల్ డియో దర్శకత్వం వహించారు. అడివి శేష్‌తో చేయబోయే సినిమా టైటిల్ ఏమిటి అనేది ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లేలను అడివి శేష్, షానియల్ డియో కలిసి సమరకూరుస్తుండడం విశేషం.
గత ఏడాది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’ తర్వాత అడివి శేష్ ‘గూఢచారి 2’ చిత్రాన్ని ప్రారంభించారు. ఇక శృతి హాసన్ ఇటీవల విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించింది శృతి హాసన్. ఈ సినిమాలో జర్నలిస్ట్ ఆద్య పాత్ర పోషించింది.
![]() |
![]() |